గ్యాస్ లీక్ అవడంతో పూరిల్లు పూర్తిగా దగ్ధం..

బాపట్ల ముచ్చట్లు:

 


బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో  రైల్వే గేట్ సమీపంలో  రోడ్డు ప్రక్కన గల బళ్లారి శ్రీనివాసరావు చెందిన పూరిల్లు ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అవడంతో పూర్తిగా కాలిపోయింది, ఉదయం కూలిపనులకు వెళ్లేందుకు వంటపని చేస్తుండగా గ్యాస్ బండ వద్ద ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగిందని బాధితులు బాధితులు తెలిపారు, చుట్టుపక్కలవారు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించినా మంటలు అదుపు చేయలేక గ్యాస్ బండ పేలుతుందనే అనే భయంతో దూరంగా వెళ్లిపోవడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది, ఇంటిలోనీ అన్ని సామాగ్రితో పాటు కుమార్తెకు ఇవ్వవలసిన 67 వేల రూపాయలు ఇంటిలోని టేబుల్ లో ఉంచగా అవి కూడా పూర్తిగా కాలిపోవడంతో బాధితులు  ఆవేదనను వ్యక్తంచేశారు, సుమారు ఆస్తినష్టం రెండు లక్షలు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు, కట్టుబట్టలతో మిగిలి నిరాశ్రయులు అయ్యామని బాధితులు వాపోయారు.

 

Tags: Purilli completely burnt due to gas leak.

Post Midle
Post Midle
Natyam ad