Natyam ad

పూరిల్లు దగ్దం

నెల్లూరు ముచ్చట్లు:

 


నెల్లూరు జిల్లా కావలి పట్టణం వెంగళరావు నగర్ లో పూరిల్లు దగ్ధమవడంతో ఓ కుటుంబం సర్వస్వం కోల్పోయింది. వరలక్ష్మి అనే మహిళ నలుగురు చిన్నారులతో వెంగళరావు నగర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది.  కొద్దిరోజుల క్రితమే తనకున్న శక్తితో సుమారు లక్ష రూపాయలపై మీద ఖర్చుపెట్టి పూరి ఇంటిని మరమ్మత్తులు చేసుకొని నివాసముంటున్నారు.  ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో ఇల్లు వస్తువులు సహా పూర్తిగా దగ్ధమైంది.  ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు మూడు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాద సమయంలో వరలక్ష్మి బయటికి వెళ్ళగా నలుగురు చిన్నారులు ఇంట్లో ఉన్నారు.  మంటలను గమనించిన స్థానికులు అప్రమత్తమై చిన్నారులను రక్షించారు. సర్వస్వం కోల్పోయిన ఆ కుటుంబం రోధిస్తున్న తీరు ఇరుగు పొరుగు వారిని కలచి వేసింది.

 

Tags: Purillu Dagdam

Post Midle
Post Midle