పాఠశాలల్లో స్వచ్ఛత, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి

కడప ముచ్చట్లు:

 

స్వచ్ఛ విద్యాలయ పురస్కార జిల్లాస్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో జిల్లా కలెక్టర్ విజయరామరాజుఆరు అంశాల్లో 38 పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ  పురష్కరాలకు ఎంపిక చేశారు ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వచ్ఛతతో పాటు క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.బుధవారం స్థానిక కలెక్టరేట్ విసి హాలులో.. సమగ్రశిక్ష  ప్రాజెక్టు ఆధ్వర్యంలో.. జరిగిన “జిల్లా స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు ప్రదానోత్సవం” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు అన్నారు జిల్లా వ్యాప్తంగా 3969 పాఠశాలకు సంబంధించి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు నమోదు చేసుకోగా..ఇందులో ప్రధానంగా ఆరు రకాల అంశాల ద్వారా ఆయా పాఠశాలను స్వచ్ఛ విద్యాలయ పురష్కరాలకు 38 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగిందన్నారు.  ఇందులో ఆరు రకాల అంశాలకు సంబంధించి మంచి నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండి  8 పాఠశాలలను  అన్ని కేటగిరిలో ప్రగతి సాధించిన పాఠశాలగా గుర్తించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీ ద్వారా స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డుకు సంబంధించి ఈ పాఠశాలను సంబందిత కమిటీ నిశితంగా పరిశీలించి అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఒక్కొక్క క్యాటగిరికి ఐదు పాఠశాలల చొప్పున 30 పాఠశాలను ఎంపిక చేసి.. మొత్తంగా వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా 38 పాఠశాలలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వాటికి సంబంధించిన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ సభ్యులను దీనికి సంబంధించి మూల్యాంకనంలో ప్రముఖ పాత్ర వహించిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, వీరందరికీ జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మోమెంటో,

 

 

 

ప్రశంసాపత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు.ప్రతి పాఠశాల స్వచ్ఛంగా ఉండాలని అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి మంచి వసతులు ఉండేవిధంగా వాటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు పరివర్తనలో మార్పు రావాలని క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల యొక్క భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని..  గురువులుగా మీ పాత్ర అత్యంత కీలక పాత్ర కీలకం అన్నారు. ఉపాధ్యాయులు కఠినంగా ఉంటేనే.. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ  నైతిక విలువలు పెంపొందుతాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను భవిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. రానున్న కాలంలో అన్ని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు కి అర్హత సాధించాలని ఆ దిశగా ప్రతిఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని ఉపాధ్యాయలును ఉద్దేశించి తెలిపారు.ఈ కార్యక్రమంలో  జిల్లా రెవెన్యూ అధికారి  వెంకటేష్,  జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి, జిల్లా మెడికల్ అధికారి నాగరాజు,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నకేశవరెడ్డి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ గంగిరెడ్డి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పాలెం రాజా, భాస్కర్ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Purity and discipline should be given the highest priority in schools

Post Midle
Natyam ad