స్వచ్ఛ మంథని లక్ష్యం
-మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని ముచ్చట్లు:
స్వచ్ఛ మంథని యే తమ లక్ష్యమని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పేర్కొన్నారు. గురువారం ఉదయం మంథని మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు పరిధిలో గల అంబేడ్కర్ చౌరస్తా, కాలేజీ గ్రౌండ్ రోడ్డులో పారిశుద్ధం పై ప్రత్యేక కార్యక్రమాన్ని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త చేదరాల తొలగింపు పనులను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు.పారిశుధ్య కార్మికులతో వాటిని తీయించారు. వార్డులోని ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంథని పట్టణంలో ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు ఏర్పాటు చేసిన నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.

Tags: Purity is the goal
