మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి ముచ్చట్లు:
భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద గల ఆమె విగ్రహానికి టీటీడీ అధికారులు శుక్రవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు జరిగిన వర్ధంతి ఉత్సవాలు ముగిశాయి.ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో ముందుగా శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీనివాస కుమార్, తేజవతి బృందం సంగీత సభ, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరుపతికి చెందిన లక్ష్మీ రాజ్యం బృందం హరికథ కార్యక్రమం జరిగింది.సాయంత్రం 6 గంటలకు ముని లక్ష్మి,
లోకనాథం రెడ్డి బృందం సంగీత సభ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా.లత తదితరులు పాల్గొన్నారు.

Tags:Puspanjali to the statue of Matrushri Tarigonda Vengamamba
