ప్రజావేదిక కూల్చి వేయండి

Put down the public platform

Put down the public platform

-సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

 

Date:24/06/2019

అమరావతి ముచ్చట్లు:

నిబంధనలకు వ్యతిరేకంగా కట్టిన భవనంలో మనం కూర్చున్నాం. అవినీతితో కట్టిన భవనంలో కూర్చున్నాం.  అవినీతి భవనం అని తెలిసి ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం. లోకాయుక్త సూచనలు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు జరిగిన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ ల సమావేశంలో అయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నదీ సంరక్షణచట్టాలను పట్టించుకోకుండా కట్టిన భవనం ఇది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నివేదిక కాపీని సదస్సులో లయన  చూపించారు. మన ప్రవర్తన ఎలా ఉండాలనేది చూపించాలని ఇక్కడే మీటింగ్ పెట్టాను. అన్ని చట్టాలు ప్రభుత్వమే భేఖాతరు చేసిందో ఈ భవనమే ఉదాహరణ అని అన్నారు. ఇదే భవనం ఎవరైనా కట్టి ఉంటే వెంటనే కూల్చేస్తాం. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిందో చూపించాలనే ఇక్కడే సమావేశం పెట్టాను. ఈ భవనంలో ఇదే చివరి సమావేశమని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా కూల్చివేస్తున్న అక్రమ భవనం ఇదే. ఎల్లుండే కూల్చివేయాలని ఆదేశిస్తున్నానని వెల్లడించారు. ఉగాది కి  ఇంటి స్థలం లేని వారు ఎవరు రాష్ట్రం లో  ఉండకూడదు. 25 లక్షల ఇంటి స్థలాలు మహిళ పేరుతో ఇవ్వాలి. పట్టా చేతి లో ఉంటుంది. కానీ స్థలం ఉండదు. దృష్టి పెట్టి ఎక్కడ ఎంత అవసరం గుర్తించి ఉగాది నాటికి రిజిస్టర్ ప్లాట్ ఇవ్వాలి. క్రెడిబిలిటీ అనే పదానికి విలువ ఉండాలి. తన లేదు మన లేదు పాలసీ కచ్చితం గా పాటించండి. జిల్లా పోర్టల్ తీసుకు రావాలి. మండలం నుండి గ్రామ స్థాయి వరకు పోలీసు,  జ్యూడిషియరీ తో సహా అన్ని తీసుకురండి. చేసే అభివృద్ధి పనుల ను కూడా పొందుపరచండని అయన అన్నారు.  కలెక్టర్లు సమగ్రంగా భూముల పై ల్యాండ్ ఆడిట్ నిర్వహించండి. ఎంతో అవసరం.

 

 

 

 

 

 

 

 

ఇతర శాఖల నుండి ఫీడ్ బాక్ తీసుకోండి. రాజ్యాంగం, చట్టం , న్యాయం ల ను తుంగలో తొక్కారు. 23 మంది ఎమ్మెల్యే ల ను తీసుకెళ్లి వారి ద్వారా మీ పై పెత్తనం చేస్తారు. మీరు ఎన్నికలు సజావు గా ఎలా జరుపుతారని అయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు పట్ల గౌరవం అభిమానం పెరగాలి. ఈ సమావేశానికి వచ్చే టప్పుడు తెలిసిన కొంతమందిని అడిగా మార్పు రావాలి అన్నారు. నేను చనిపోయినా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి..ఇదే నా ఆశయం. ట్రాన్సఫరన్స్, అండ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం గా ఉండాలని అన్నారు. ప్రతి సోమవారం స్పందన పేరుతూపిర్యాదు లను స్వీకరించండి…ఆ రోజూ ఏ మీటింగ్ లు ఉండవద్దని సూచించారు. పిర్యాదు తీసుకోగానే రసీదు ఇవ్వండి..ఫోన్ నెంబర్ తీసుకోండి. గడువు కూడా ఇవ్వండి. నేను కూడా రచ్చబండ
నిర్వహిస్తా.ర్యాండమ్ గా చెకింగ్ చేస్తా. .పై స్థాయి వారు కూడా ర్యాండమ్ చెక్ చేయండి. మొక్కుబడి గా కాకుండా సమర్థవంతం గా నిర్వహించాలి. ప్రతి 3 శుక్రవారం  మన దగ్గర పనిచేసే సిబ్బంది కోసం కేటాయించండి..సమస్యలను పరిష్కరించండని అన్నారు.

 

 

 

 

 

 

 

సీఎం నుంచి కలెక్టర్వరకూ, కలెక్టర్ నుంచి గ్రామస్థాయి వరకూ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రతి అడుగులోనూ పారదర్శకత కనిపించాలి. దేశం మొత్తం మనవైపు చూసేలా ఈ మార్పు రావాలని అన్నారు. మిగిలిన చోట్ల అమలు చేయడానికి మనం నమూనాగా ఉండాలి. ప్రజలకు హక్కుగా సేవలు అందాలి. దానికోసం లంచాలు ఇవ్వకూడదు. ప్రజలు ఆఫీసులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదని అయన అన్నారు. మన ప్రభుత్వంలో, మనం అధికారంలో ఉండగా ప్రజలకు ఏం కావాలన్నా.. లంచాలు ఇస్తే తప్ప జరగని పరిస్థితి నుంచి బయటకు రావలి. పనులకోసం ఆఫీసులచుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని జగన్ అన్నారు.

లోక్ సభలో జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లు

Tags: Put down the public platform

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *