Natyam ad

రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి గెలిపించండి

– ఓటర్లకు మంత్రి పెద్దిరెడ్డి వినతి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి, రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరె డ్డి రామచంద్రారెడ్డి కోరారు. సోమవారం పట్టణంలోని వికాస్‌ పాఠశాలలో శ్రీనివాసపురం ఎమ్మెల్యే శివారెడ్డితో కలసి మంత్రి ప్రైవేటు టీచర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు ఎస్టీఎఫ్‌ సిద్ధిక్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేశారు. పోలీంగ్‌కు ప్రతి ఒక్కరు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి, వేయించి గెలిపించాలని కోరారు. రానున్న ఐదేళ్లలో పుంగనూరు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు. ఎంపీ అభ్యర్థిగా బిజెపి తరపున పోటీ చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి పుంగనూరు అభివృద్ధిని అడ్డుకున్న విషయాలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని కోరారు. అతనిని ఓడించి , గుణపాఠం నేర్పాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, జయరామిరెడ్డి , జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags; Put two votes on the fan mark and win

Post Midle