బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహరావు
-తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన నాయకుడు
ఉమ్మడి కరీంనగర్ ముద్దుబిడ్డ దేశ ప్రధానిగా సేవలందించడం గర్వకారణం
బండి సంజయ్
కరీంనగర్ ముచ్చట్లు:
మాజీ ప్రధాని పివి నరసింహారావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం నిశాళులర్పించారు.తెలుగు తేజం, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు ఎందరికో స్పూర్తిగా నిలిచారని బండి కొనియాడారు. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 18వ వర్దంతిని పురష్కరించుకుని కరీంనగర్ లోని తన కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. • హైదరాబాద్ సంస్థాన విమోచన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన నాయకుడు పీవీ నర్సింహారావు అని స్మరించుకున్నారు.
స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టిన పీవీ నర్సింహరావు తెలంగాణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డ కావడం గర్వకారణమన్నారు. ఆ మహనీయుడికి తెలంగాణ ప్రజల తరపున ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

Tags: PV Narsimha Rao is a multi-lingual poet
