శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో పైతాన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ వర్క్ షాపు

రాయచోటి  ముచ్చట్లు:

పట్టణంలోని స్థానిక మాసాపేట శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులు కోసం పైతాన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్  డేటా సైన్స్ అనే అంశంపై  మూడు రోజుల వర్క్ షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య రిసోర్స్ పర్సన్ గా టి.మురళీకృష్ణ హాజరయ్యారు .హాజరైన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో సి, సి ప్లస్ ప్లస్, మరియు జావా లాంటి  ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్థానాలను పైతాన్ లాంగ్వేజ్ అధిగమించి,వెబ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్,ఎంబెడెడ్ అప్లికేషన్స్ వంటి రంగాలలో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాత్ర కీలకం అని తెలియజేశారు .శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం .సుధాకర్ రెడ్డి  మాట్లాడుతూ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న సమయంలోనే ఉద్యోగావకాశాలను అందుకోవడానికి ఇలాంటి వర్క్షాపులు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. డేటా అనాలసిస్, టాస్క్ ఆటోమేషన్, డేటా విజువలైజేషన్, పై చార్ట్స్  వంటి డిజిటల్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు వ౦ద  శాతం  ఉద్యోగ అవకాశాలకు మౌలిక వసతులను కల్పిస్తున్నామని అర్థమెటిక్, రీజనింగ్ ,మరియు కమ్యూనికేషన్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు .హాజరైన విద్యార్థిని విద్యార్థులు పైతాన్ లాంగ్వేజి ప్రోగ్రామింగ్ పై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. బాలాజీ  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి సుభహాన్ ,వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags: Python Language Programming Workshop at Sri Sai Engineering College

Leave A Reply

Your email address will not be published.