మొక్కలకు క్యూ ఆర్ కోడ్

వరంగల్ ముచ్చట్లు:

 

క్యూ ఆర్ కోడ్.. కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ షాపింగ్ మాల్‌, చిన్న చిన్న దుకాణాల్లోనూ ఈ క్యూఆర్‌తో ఆర్థికలావాదేవీలు చేస్తుంటారు. అందుకు భిన్నంగా వరంగల్ అర్భన్ జిల్లాలో చెట్లకు కూడా క్యూఆర్ కోడ్ అమర్చారు. అది స్కాన్ చేస్తే చాలు చెట్టుకున్న చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంది. హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీలోని అధ్యాపకులు.. చెట్లకు క్యూఆర్ కోడ్ అమార్చి ప్రత్యేకతను చాటుకున్నారు. చెట్లకు క్యూ ఆర్ విశేషాలెంటో ఇప్పుడు చూద్దాం.. మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అందులో ఔషధ మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి.. కానీ, వాటి గురించి ఎనుకటి తరం వాళ్లు చెప్తే కానీ, తెలిసే అవకాశం ఉండదు.. ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పటి తరం వారికి మొక్కల చరిత్రను తెలియజేసేందుకు వరంగర్ అర్బన్ జిల్లా హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీలోని అధ్యాపకులు బృహత్తర కార్యక్రమం చేపట్టారు. కాలేజీలో 214 మొక్కల శాస్త్రీయ నామలు, ఔషధ గుణాలు, వాటి మనుగడ, వంటి విషయాలతో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామంటున్నారు వృక్షాశాస్త్ర అధ్యపకులు. తమ కాలేజీలో అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలను పెంచుతున్నామంటున్నారు.

 

 

 

 

మానవజాతి మనుగడకు ఉపయోగపడే మొక్కలను క్యూఆర్ కోడ్ ‎తో ఈజీగా తెలుసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ అమార్చారు. వాటి ఉపయోగాలను అందులో అమర్చారు. తిప్పతీగ, తేలుకొండి, అజాడి, నెలవాయి, వావిలి, హలోవెరా మారేడు, నెలవాయి, ఉసిరి, తులసి, బిగ్గస, వాము లాంటి మొక్కలను పెంచుతున్నామంటున్నారు.  కాకతీయ డిగ్రీ కాలేజీలో పెంచుతున్న ఔషధ మొక్కలు కరోనా సమయంలో చాలా మంది ప్రజలు ఆయుర్వేదం వైద్యం వైపు ఎదురు చూశారు. కరోనా మందుకు సంబంధించిన ఔషధ గుణాలున్న మొక్కలు చాలా ఉన్నాయి. ఈ మొక్కల గురించి తెలుసుకోవడం కోసం చాలా మంది మేధావులు, విద్యార్థులు, ప్రజలు చాలా మంది వస్తున్నారని అధ్యాపకులు చెప్తున్నారు.. వరంగల్‌ ప్రజలకు ఈ మొక్కల క్యూఆర్ కోడ్ ఎంతగానో ఉపయోగ పడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొక్కల చరిత్రను చెప్పడంతో పాటు ఔషధ మొక్కల వివరాలు ఇప్పటి తరానికి తెలియజేయడం కోసం అధ్యపకులు చేస్తున్న ప్రయత్నానికి.. స్థానికులు కృతజ్ఞతలు చెప్తున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: QR code for plants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *