ప్రజలందరికీ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలి

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభం

కడప ముచ్చట్లు:


మారుతున్న కాలానికి అనుగుణంగా  ఆర్యోగ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ,ప్రజలందరికీ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  ఎస్. బి అంజాద్ బాషా అన్నారు.ఆదివారం నగరంలోని మారుతి నగర్ లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన  విద్యా సాగర్ హాస్పిటల్ ను  నగర మేయర్ కె. సురేష్ బాబుతో కలసిరాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష  ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  మాట్లాడుతూ….ఎముకలు ,కీళ్ల నొప్పులకు నిపుణులు డా. విద్యా సాగర్ నగరంలోని ప్రజలకు సేవలందించాలన్న  ఉద్దేశ్యం తో అధునాతన హస్పిటల్ ను నేడు  ప్రారంబించడం మంచి విషయం అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు సేవ చేయడం హర్షించ దగ్గ  విషయం అన్నారు. ఆర్థ్రరైటీస్ వ్యాధులతో   ఇబ్బందులు పడుతున్న వారికి అధునాతన పరికరాలతో  వైద్య సేవలు అందజేయడం అభినందనీయమని అన్నారు.
అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి  ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కి  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి   మరింత ప్రాధాన్యత కల్పించి  ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తూ 1000 రూ దాటిన  ప్రతి ఒక్కరికీ,అలాగే దాదాపుగా 2600 పైగా సేవలను, ఆరోగ్యశ్రీ పథకం కిందకి చేర్చారన్నారు.రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని ప్రజలు ఆశీస్సులు అందించాలన్నారు.అనంతరం స్నాక్ సిటీ కేఫ్ ను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్లు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, విద్యాసాగర్ హాస్పిటల్ సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Quality and better medical services should be provided to all people

Leave A Reply

Your email address will not be published.