Natyam ad

పుంగనూరులో విద్యార్థులకు నాణ్యమైన భోజనం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెను ప్రకారం పంపిణీ చేయడం జరుగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి మండలంలోని గుడిసెబండ సచివాలయాన్ని తనిఖీ చేశారు. వినతుల నమోదు, ఉద్యోగుల హాజరు పట్టిని పరిశీలించారు. అలాగే మోదుగులపల్లెలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. అలాగే మధ్యాహ్నన భోజన పథకాన్ని పరిశీలించి ,విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలకు నాడు-నేడు నిధులు కేటాయించి, పాఠశాలలను మరమ్మతులు చేపట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్‌వాడీలలో, పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని మెనుప్రకారం పంపిణీ చేసి విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీఠ వేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాపిరెడ్డి, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Quality food for students in Punganur – MPP Bhaskar Reddy
More about this source textSource text required for additional translation information
 

Post Midle

Leave A Reply

Your email address will not be published.