నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలి
ఆత్మకూరు ముచ్చట్లు:
మాంసపు విక్రయదారులు నాణ్యతతో కూడిన పరిశుభ్రమైన మాంసాన్ని మాత్రమే నిర్వహించాలని ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాంసపు విక్రయదారులు ఆదేశించారు. ఆత్మకూరు పట్టణంలో ని మాంసపు విక్రయ దుకాణాలను ప్రజారోగ్య సిబ్బందితో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మాంసపు విక్రయదారుల తో ఏర్పాటుచేసిన సమావేశంలో వారికి పలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మాంసపు విక్రయ దుకాణాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడకుండా నుంచి వేరు చేసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలన్నారు పట్టణంలోని చికెన్ సెంటర్ లోని వ్యర్థాలను ప్రతిరోజు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి చికెన్ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తామని తెలిపారు ఇందుకుగాను వ్యాపారుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఓబులేసు శానిటరీ ఇన్స్పెక్టర్ జీవన్ శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.
Tags: Quality meat should be sold

