నాణ్యత నగుబాటు..

Quality Narration ..

Quality Narration ..

Date:15/09/2018
మెదక్ ముచ్చట్లు :
అభివృద్ధి పనుల్లో అక్రమాలు, అవకతవకలను సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వం ముందునుంచీ చెప్తోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన పలు పనుల్లో అవకతవకలు కనిపిస్తున్నాయి. రహదారుల సంగతే తీసుకుంటే.. పలు ప్రాంతాల్లో వేసిన రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. మెదక్ జిల్లా రుక్మాపూర్‌ వద్దా ఇలాంటి రోడ్ వల్లే వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. రోడ్డు వేసిన నెల రోజుల్లోనే పాడైపోయిందని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..  చేగుంట నుంచి బోనాల రూట్ లో కొత్తగా బీటీ రోడ్డు నిర్మించారు.  రూ. 25 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేశారు.
రహదారి నిర్మాణాన్ని 2015 సెప్టెంబరులో ప్రారంభించారు. మిగతా పనులు పూర్తయినా రుక్మాపూర్‌ నుంచి ఇబ్రహీంపూర్‌ వరకు మధ్యలో 1.6 కి.మీ. దూరం అటవీ శాఖ అనుమతులు రాకపోవటంతో విస్తరణ జరగలేదు. ఎట్టకేలకు ఇటీవల అటవీ ప్రాంతంలో రహదారిని విస్తరించేందుకు అనుమతులు వచ్చాయి. గుత్తేదారులు పనులను శరవేగంగా చేపట్టారు. కానీ నాసిరకం పనులు చేపట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపించడంతో నెల క్రితం వేసిన తారు రోడ్డు అప్పుడే రూపు కోల్పోయింది. బీటీ పలుచోట్ల ధ్వంసమై కంకర తేలింది.
కొన్నిచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. బీటీ లేచిపోయి కంకర తేలిన చోట మొరం పోసి మరమ్మతులు చేస్తున్నారు. ఈ మార్గంలో రోజు చాలా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి రోడ్డులో నాణ్యత లోపించడంపై వాహనదారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. రాత్రివేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇదిలాఉంటే చేగుంట నుంచి గజ్వేల్‌ మార్గంలో చాలాచోట్ల వంతెనల నిర్మాణం సాగుతోంది.
ఈ మార్గంలో ఏడాది క్రితమే రెండు వరసల రహదారి నిర్మాణం పూర్తి చేశారు. కానీ వంతెనల వద్ద బీ 15 oneటీ వేయలేదు. ఇటీవల ఆ పనులూ పూర్తయ్యాయి. బీటీ వేసే విషయంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఫలితంగా రోడ్డు పాడైందని స్థానికులు విమర్శిస్తున్నారు.
జీవాక పరిశ్రమ సమీపంలోని వంతెన వద్దా తారు లేచిపోయిందని చెప్తున్నారు. 15 రోజులకే రహదారి పాడైనా కనీస మరమ్మతులు చేయడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
Tags:Quality Narration ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *