Quality seeds for all farmers

రైతులందరికి నాణ్యమైన విత్తనాలు

Date:22/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తొలిసారిగా రైతులందరికి రైతు భరోసా కేంద్రాలలోనే నాణ్యమైన విత్తనాలను అందించడం జరుగుతోందని ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లె గ్రామంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు మండలంలోని రైతులందరికి వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపి జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి,ఎంపీటీసీ రెడ్డెప్ప, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, ఏవో సంధ్య తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Tags; Quality seeds for all farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *