అంగన్‌వాడీల్లో నాణ్యమైన సేవలు
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోఅంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిబిడ్డల క్షేమం కోసం నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. మంగళవారం మున్సిపాలిటిలో ఎంపికైన అంగన్‌వాడీ ఉద్యోగులకు నియామకపు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, సహాయక పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడం జరిగిందన్నారు. జగనన్న సంపూర్ణ పోషణ పథకం క్రింద మున్సిపాలిటిలోని గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు పోషణ కిట్లను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఎన్నడు లేని విధంగా అంగన్‌వాడీలు ఆదర్శవంతంగా పని చేస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంతియాజ్‌ఖాన్, కొండవీటి నరేష్ లు పాల్గొన్నారు.

Tags: Quality services in Anganwadi
