పుంగనూరులో ఆర్‌బికెల ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు – ఎంపిపి భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆర్‌బికెల ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం రైతు సలహ మండలి అధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో ఆర్‌బికె ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇవ్వడం, నర్సరీలకు లైసెన్సులు మంజూరు చేయడంతో పాటు గొర్రెలకు వ్యాదులు సోకకుండ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించిందన్నారు. వీటిపై అన్నిశాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీపతి, తహశీల్ధార్ వెంకట్రాయులు, ఏవో సంధ్య, వైఎస్సార్సిపి నాయకులు చంద్రారెడ్డి యాదవ్, రామకృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Quality services to farmers through RBKL in Punganur – MP Bhaskar Reddy