Natyam ad

ఉపాధిహామీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

చౌడేపల్లె ముచ్చట్లు:

ఉపాధిహామీ పథకంలో చేప్రట్టే ప్రతి పనుల్లో నాణ్యత ప్రమాణాలతోపాటు, నిర్థేశించిన పద్దతులను పాటించాలని సీనియర్‌ క్వాలిటీ కంట్రోలర్‌ అధికారి ఆనంద్‌ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష జరిగింది. ఎన్‌ఐసీ విధి విధాలను త ప్పనిసరిగా పాటించాలన్నారు. అంచనాలో పొందుపరిచిన మేరకు పనులు చేపట్టాలన్నారు. పనుల సమయంలో తీసిన మట్టిన బర్మ్ వదిలి కట్టగా వేయాలన్నారు. కట్టపై వేసిన మట్టిన సెక్షన్‌ చేయాలన్నారు.కూలీలు చేసిన పనికి మాత్రమే టాస్క్ వారీగా గుర్తించి పేమెంట్‌ చేయాలన్నారు. కొలతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సాంకేతిక సిబ్బందికి అవగాహన కల్పించారు.పని జరిగే ప్రదేశంలో మస్టర్‌ రోల్‌ ఉండేలా చూడాలని ఆదేశించారు. రికార్డుల అబ్‌డేట్‌ తోపాటు వర్క్ ఫైల్‌ను నిర్వహించాలని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా పనులు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఏపీఓ శ్రీనివాస్‌, జెఈ ధనుంజయుడు, టిఏలు అమరనాథ్‌, సయ్యద్‌భాషా ఉన్నారు.

 

Post Midle

Tags: Quality standards should be followed in employment guarantee works

Post Midle