Natyam ad

పుంగనూరు కళాశాలల్లో నాణ్యమైన బోదన

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన భోదన అందించడం జరుగుతోందని ప్రిన్సిపాల్‌ కమలాకర్‌ అన్నారు. సోమవారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు బాలికల కళాశాలలో అన్ని సబ్‌జెక్టులలో నాణ్యమైన భోదన అందిస్తున్నామన్నారు. అలాగే మౌళిక వసతులు ఏర్పాటు చేసి, ఆదర్శమైన కళాశాలలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ , ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యాపకులు విజయకుమారి, జగన్‌మోహన్‌, రఘు, దేవిక, భారతి, బాలరాజు, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Quality teaching in Punganur colleges

Post Midle