Natyam ad

ఇనుప బోనుల్లో  క్వారంటైన్

బీజింగ్ ముచ్చట్లు:
 
డ్రాగన్ కంట్రీ చైనా ఏది చేసినా అతిగానే ఉంటుంది. కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిపెట్టినా.. తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్ ను ముంచెత్తినా.. ఇంకేది చేసినా అంతే మరి..! తాజాగా కరోనా నియంత్రణ కోసం చైనా చేస్తున్న చర్యలు కూడా అంతే అతిగా ఉన్నాయని ప్రపంచం కోడై కూస్తోంది. ఏదైనా ఒక గ్రామంలో గానీ, ఒక ప్రాంతంలో గానీ ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా ఆ ఊరు మొత్తానికి క్వారంటైన్ శిక్ష వేస్తోంది. అది కూడా ఎవరూ ఊహించని విధంగా చిన్న చిన్న ఇనుప బోనుల్లోకి అనుమానితులను నెట్టేస్తోంది. కోవిడ్ అనుమానితుల కోసం చైనా ఏర్పాటు చేసిన ఇరుకు ఇరుకు ఇనుప బోనుల్లో బంధించి పారేస్తోంది డ్రాగన్ కంట్రీ. ఒక్కో బోనులో ఒక బెడ్, మరుగుదొడ్డి మాత్రమే ఏర్పాటు చేశారు.క్వారంటైన్ క్యాంప్ గదుల పేరిట చైనా ప్రభుత్వం వరుసగా మెటల్ బాక్స్ లు ఏర్పాటు చేసింది. ఎవరిలోనైనా కోవిడ్ ఉన్నట్లు అనుమానం వస్తే చాలు.. చైనా అధికారులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారిని బలవంతంగా లాక్కెళ్లి ఆ ఇరుకు ఇనుప బాక్సుల్లో జంతువుల్ని పడేసినట్లు పడేస్తున్నారు. అదేమంటే.. ఇదంతా జీరో కోవిడ్ పాలసీలో భాగంగా చేస్తున్నట్లు చైనా చెప్పుకుంటోంది. ఇలా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు అనే తేడా కూడా చూపించకుండా అందర్నీ తీసుకెళ్లి క్వారంటైన్ బాక్సుల్లోకి నెట్టేస్తుండడం గమనార్హం. ఇలా ప్రస్తుతం చైనాలో 2 కోట్ల మంది చైనీయులు ఈ ఇనుప బాక్సుల క్వారంటైన్ లో ఉన్నారట.చైనాలోని అతి పెద్ద నగరాలు షియాన్, టియాంజిన్, అన్యాంగ్ లలో కరోనా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దీంతో ఆ నగరాల్లో చైనా సర్కార్ ఇలాంటి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా అనుమానం వచ్చినా సరే ఈ ఇరుకు ఇనుప పెట్టెల్లో రెండు వారాలు క్వారంటైన్ తప్పకుండా ఉండి తీరాల్సిందే.
 
 
క్వారంటైన్ గదులకు చిన్న కిటికీలు మాత్రమే పెట్టారు. ఆ కిటికీ నుంచి తల మాత్రమే బయటపెట్టి రోజువారీ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. చిన్నారులకు కూడా మినహాయింపేమీ లేదు. పెద్దవారితో కాకుండా ఇరుకు గదుల్లో ఒంటరిగా ఉండాల్సిందేనట. కొన్ని చోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అకస్మాత్తుగా వచ్చి, ప్రజలను క్వారంటైన్ గదులకు తరలిస్తుండడంతో అందరూ వణికిపోతున్నారు. కరోనా అనుమానితులను తరలించేందుకు వందలాది బస్సులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది డ్రాగన్ కంట్రీ సర్కార్. కరోనా అనుమానితుల కోసం ట్రాక్, ట్రేస్ యాప్స్ ను అధికారులు వినియోగిస్తున్నారు.తరలించేందుకు వరుసగా నిలబడిన బస్సులు, చిన్నారులకు పీపీఈ కిట్లు వేసి తరలిస్తున్న వీడియోలను కొందరు ఇటీవలే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. జరిగే వింటర్ ఒలింపిక్స్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ఇలాంటి కఠిన ఆంక్షలు విధిస్తోందంటున్నారు.  ఒలింపిక్స్ కు బీజింగ్ ఆతిథ్యం ఇస్తుండడం వల్లే డ్రాగన్ కంట్రీ కఠినంగా వ్యవహరించేలా చేస్తోందని చెబుతున్నారు. లాక్ డైన్ ను కఠినంగా అమలు చేస్తుండడంతో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు కొనుక్కునేందుకు కూడా చైనా ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Quarantine in iron cages

Leave A Reply

Your email address will not be published.