90 వేల ఉద్యోగాలకు కోటిన్నర అప్లికేషన్స్

Date:15/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఇటీవలే దాదాపు 90 వేల ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం ఇప్పటివరకు… ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి సంఖ్య కోటిన్నర దాటిందని రైల్వే బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక దశలో పేరు, చిరునామా వివరాలు ఇచ్చే ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తయిందని, తర్వాతి దశలో ఇతర వివరాలు, ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఈ ఉద్యోగాలకు రూ.18,000 నుంచి రూ.60,000 వరకు జీతం ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.రైల్వేశాఖ జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం… గ్రూప్-సి కేటగిరీలో 26,502 పోస్టులు, గ్రూప్-డి కేటగిరీలో 62,907 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు… ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 వరకు ఇంకా గడువు ఉంది.
Tags: Quarterly applications for 90 thousand jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *