యాంటీ బాడీ టెస్టులకు క్యూ

Date:01/09/2020

వరంగల్ ముచ్చట్లు:

కరోనా యాంటిబాడీ టెస్టుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. కరోనా వచ్చిపోయిందేమోననే అ నుమానంతో కొందరు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో టెస్టుకు 800 నుంచి 1500 వ రకు ఫీజులు తీసుకుంటున్నట్లు సమాచారం. వాస్తవంగా కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు ప్రభుత్వమే యాంటిబాడీ టెస్టులను నిర్వహిస్తుందని రెండు నెలల క్రిందట అధికారులు ప్రకటించారు. దీనిలో భాగంగా 25వేల కిట్లు ఆర్డర్ ఇచ్చామని, తొలి విడత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు చేస్తామని వైద్యశాఖ ప్రకటించింది. పలు ప్రెస్‌మీట్‌లలో కూడా అధికారులు అనేక సార్లు వెల్లడించారు. కానీ అవి ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.అ యితే ఈ టెస్టు చేపించుకునేందుకు అనుమానితు లు పెరగడంతో ప్రైవేట్ ల్యాబ్‌లు అధిక సంఖ్యలో కిట్లను తెచ్చుకొని మరీ టెస్టులను చేస్తున్నాయి. యాంటిబాడీ టెస్టులు ద్వారా వైరస్ వచ్చి పోతే తె లుస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన మూడు రోజుల త ర్వాత యంటిబాడీలు ఉత్పత్తి అవుతాయి.

 

వీటిలో ఐజిఎం, ఐజిజి అనే రెండు రకాలు ఉంటాయి. వైరస్ సోకిన తర్వాత 4 నుంచి 7వ రోజులో ఐజి ఎం ఉత్పత్తి అయి గరిష్ఠంగా 22 రోజుల వరకు శరీరంలో ఉంటాయి. పది నుంచి 14 రోజుల త ర్వాత ఐజిజిలు పుడతాయి. ఇవి సగటున 50 రోజుల వరకు, గరిష్ఠంగా 6 నెలలు కూడా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు.రక్తంలోని సీరమ్ టె స్టు ద్వారా ఐజిఎం, ఐజిజి యాంటిబాడీలు ఉన్న ది లేనిది తెలుసుకోవచ్చు.ఒకే టెస్టుతో రెండింటినీ తెలుసుకోవచ్చు. అయితే సీరమ్ టెస్టులో ఐజిఎం యాంటిబాడీస్ మాత్రమే ఉన్నట్లు తెలితే, వైరస్ సోకి పది రోజులులోపు, ఐజిఎం, ఐజిజి రెండు ఉన్నట్లు తేలితే వైరస్ సోకి 10 నుంచి 20 రోజులు అవుతున్నట్లు లెక్కని ప్రో డా రాజరావు తెలిపారు. కేవలం ఐజిజి మాత్రమే వస్తే వైరస్ వచ్చి పూర్తిగా నయమైపోయినట్లని వారు తెలిపారు. అయితే ఇవి 7 శాతం కంటే ఎక్కువగా ఉండాలని చెప్పా రు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్లాస్మాడోనర్స్‌కు మాత్ర మే యాంటిబాడీ టెస్టులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అదికూడా ప్లాస్మాబ్యాంక్ ఉన్న గాంధీ నోడల్ కేంద్రంలో మాత్రమే ఈ పరీక్షలు జ రుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కిట్ల కొరతతోనే తొలి విడత వీరికి చేస్తున్నామని, రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులోకి తెస్తామని వైద్యశాఖ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

 అక్కరకు వస్తున్న బస్తీ దావాఖానలు

 

Tags:Queue for anti-body tests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *