Natyam ad

తెలంగాణకు బీజేపీ నేతల క్యూ

హైదరాబాద్ ముచ్చట్లు:


ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన వేళ… అధికార బీఆర్ఎస్ ను ఓ రేంజ్ లోనే టార్గెట్ చేశారు. అవినీతి, కుటంబపాలన అంటూ పరోక్షంగా కేసీఆర్ విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు. ఫలితంగా ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ షురూ అయింది. ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలు నువ్వా -నేనా అన్నట్లు ముందుకెళ్తున్నాయి. అధికార బీఆర్ఎస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే… ఇప్పటికే రెండుసార్లు అధికారానికి దూరమైన తెలంగాణ కాంగ్రెస్…ఈసారి ఎలాగైనా గెలిచాలని చూస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం… తెలంగాణపై సీరియస్ గా ఫోకస్ పెట్టేసింది. గత కొంతకాలంగా ఆ పార్టీ బలపడుతూ వస్తోంది. కీలమైన ఉపఎన్నికలతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన కమలనాథులు… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అగ్రనేతలు కూడా వరుసగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన వేళ… ఆ పార్టీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి.తాజాగా ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ కి వచ్చిన నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నెలకొంది. ఇప్పటికే పలుమార్లు అమిత్ షాతో పాటు జేపీ నడ్డా వంటి అగ్రనేతలు వస్తున్నారు. ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో… ప్రత్యేక ఆపరేషన్ షూరు చేస్తున్నారు.

 

 

 

ఇప్పటికే లిక్కర్ కేసు, పేపర్ లీకేజీ వంటి అంశాల్లో కూడా కమలనాథులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. తాజాగా బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ టార్గెట్ గా ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో అవినీతి, కుటుంబపాలన అంటూ అగ్రనేతలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే…. మే నెలలో కూడా ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పటికీ…. బీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో… మరింత దూకుడు పెంచే దిశగా కూడా కమలనాథులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. మిషన్ 90 టార్గెట్ కూడా ఇదే..! ఇప్పట్నుంచే ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంపై చూసే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది.

 

 

 

Post Midle

ఆయా నియోజకవర్గాల స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో చేపట్టాల్సిన చర్యలపై కూడా లోతుగానే చర్చిస్తోంది. ఈ సీట్లలో బలమైన అభ్యర్థులను తెరపైకి తీసుకురావటంతో పాటు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా కసరత్తు చేస్తోంది.మొత్తంగా మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో….బీజేపీ దూకుడు పెంచే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎన్నికల వేడి మరింత పెరిగనుంది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

 

Tags:Queue of BJP leaders for Telangana

Post Midle