గాంధీ భవన్ లో క్వీట్ ఇండియా దినోత్సవం

హైదరాబాద్ ముచ్చట్లు:


క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, నిరంజన్, నాయకులు కల్వ సుజాత, రోహిన్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి సేవాదల్ చీఫ్ సుబ్రహ్మణ్య ప్రసాద్ తదితరులు పాల్గోన్నారు.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ క్విట్ ఇండియా దొనోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలను అణచివేతకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. నేడు దేశాన్ని వెస్ట్ ఇండియా కంపెనీ దోచుకుంటుంది. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అణచివేత, దోపిడీ, అక్రమాలకు పాల్పడుతున్నారు. దేశంలో మోడీ మతం పేరుతో, రాష్ట్రంలో కేసీఆర్ ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతు వారి తాబేదార్లకు దేశాన్ని దోచిపెడుతున్నారు.

 

 

నాడు బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద పన్ను వేస్తే గాంధి ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చి పెద్ద ఉద్యమాన్ని చేపట్టి బ్రిటిష్ వాళ్ల మెడలు వంచి దేశం నుంచి తరిమేశాడు. నేడు మోడీ పిల్లలు తాగే పాలు, పెరుగు అన్ని నిత్యావసర వస్తువుల మీద అడ్డగోలు పన్నులు వేసి వేధిస్తున్నాడు. మోడీ తన తాబేదార్లను, కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు లక్షల కోట్ల సంపదను దోచిపెడుతున్నారు. నేడు దేశం, రాష్ట్రంలో ఈ అసమర్ట.పాలకులతో చిన్నాభిన్నం అవుతుంది. దేశంలో క్విట్ మోడీ, రాష్ట్రంలో క్విట్ కేసీఆర్ ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు గా మన పైన ఉంది. ఈ దేశానికి మనం స్వాతంత్రం తెచుకున్నాం.. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాదించుకున్నాం…అలాంటి దేశాన్ని , రాష్ట్రాన్ని తిరిగి కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. మరో పోరాటానికి సిద్ధం కావాలి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలకు ప్రజలు కలిసి రావాలని అన్నారు.

 

Tags: Quiet India Day at Gandhi Bhavan

Leave A Reply

Your email address will not be published.