కోట్లు సరే.. మొక్కలేవి..? (శ్రీకాకుళం)

Quotes are OK .. plants ..? (Srikakulam)

Quotes are OK .. plants ..? (Srikakulam)

 Date:16/07/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
జిల్లాలోని సోంపేట, టెక్కలి, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, పాతపట్నం, పాలకొండ క్లస్టర్లలో రహదారులకిరువైపులా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సౌజన్యంతో వెలుగు ఆధ్వర్యంలో నీడ, ఫలాలిచ్చే రకాల మొక్కలు నాటే కార్యక్రమం ఆరంభించారు. ఒక్కొక్క పంచాయతీలో కి.మీ. పొడవున రోడ్డుకు ఇరు వైపులా 400 మొక్కలు నాటారు. గ్రామైక్య సంఘాల సభ్యులకు సంరక్షణ బాధ్యత అప్పగించారు. ఈ కార్యాచరణ ఆరంభించి ఇప్పటికి ఏడాదయింది. అయినా ఆశించినత ప్రయోజనం కనిపించటం లేదు. మొక్కలు ఎండి మోడుగా దర్శనమిస్తున్నాయి.  రక్షణకు ఏర్పాటు చేసిన గూళ్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఆచూకీనే లేవు. ఇక మొక్కల జాడ సైతం దొరకటం లేదు.గతేడాది జులైలో ఆరంభమైన ఈ పథకంలో భాగంగా రూ. లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క క్లస్టర్‌ పరిధిలో ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల పైనే వ్యయమవుతోంది. అయినా మొక్కల పర్యవేక్షణ కొరవడంతో నిధులన్నీ దుర్వినియోగం పాలవుతున్నాయి. గ్రామస్థాయిలో నియమించిన అధికారుల సైతం కనీసం పట్టించుకోవటం లేదు. అలాగే నెలవారీ వేతనాలు చెల్లించేస్తున్నారు.మొక్కల ఏపుగా పెరిగేందుకు సేంద్రియ ఎరువులు వినియోగించాలనుకున్నారు. ప్రతి పంచాయతీకి 200 కిలోల చొప్పున అందించారు. ఇతర మండలాలలో రైతులు తయారు చేసిన సేంద్రియ ఎరువును కిలో రూ. 13కు కొనుగోలు చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రతి వృక్ష మిత్రకు 200 కిలోల చొప్పున సేంద్రియ ఎరువును అందిచారు. మొక్కలే లేకపోతే ఎరువులు ఎక్కడ వేస్తారు. కానీ, మండల కేంద్రాలకు వచ్చిన ఎరువులన్నీ ఎక్కడికి వెళ్లాయో  తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా సేంద్రియ ఎరువుల వ్యవహారం అనుమానాలకు తావిచ్చేలా మారిపోయింది.హరిత వాతావరణం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోయే పరిస్థితి ఏర్పడింది. ఏటా రూ. కోట్లతో చేపడుతున్న మొక్కల పెంపకం దుర్వినియోగమవుతోంది. ఇది అధికారుల నిర్లక్ష్యధోరణికి అద్దం పడుతోంది. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోడ్ల పక్కల మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టారు. అయితే మరింత సత్ఫలితాలు పొందాలన్న ఉద్దేశంతో వెలుగు విభాగం ద్వారా మొక్కల పెంపకం చేపట్టారు. ఈ కార్యక్రమం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయినా ప్రభుత్వ ఆశయం నేరవేర్చడంలో విఫలమవుతున్నాం అన్న భావన వ్యక్తమవుతోంది. జిల్లా ఉన్నతాధికార యంత్రంగం ప్రత్యేక దృష్టి సారించకపోతే నిధులు ఇలా దుబారా అవుతూనే ఉంటాయనే ఆరోపణలు వస్తున్నాయి. మందస: మండలంలో 30 పంచాయతీల పరిధిలో ఇరువైపులా 14,600 మొక్కలు నాటారు. అంబుగాం, బొగాబంద, బుడార్శింగి, చీపి, హంసరాలి, హొన్నాలి, జిల్లుండ, కొండలోగాం, దేవపురం, పిడిమందస, సొండిపూడి, సిద్ధిగాం, సాబకోట రహదారుల్లో పది శాతం మొక్కలయినా కనిపించడం లేదు. మహాదేవిపురం గ్రామం నుంచి పొత్రియా గ్రామం వరకు రోడ్డుకిరువైపుల మొక్కలు నాటినా సంరక్షణ లేకపోవటంతో కొన్ని  చనిపోయాయి. సున్నాడ గ్రామానికి వెళ్లే మార్గంలో చెరువుగట్టుపై నాటినా సంరక్షణ లేక ముళ్లపొదలు, పిచ్చిమొక్కల మాటున ఉండిపోయాయి.
కోట్లు సరే.. మొక్కలేవి..? (శ్రీకాకుళం) https://www.telugumuchatlu.com/quotes-are-ok-plants-srikakulam/
Tags:Quotes are OK .. plants ..? (Srikakulam)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *