ఆర్. కృష్ణయ్య రాజ్యసభ ఏం.పిగా ప్రమాణ స్వీకారం హర్షణీయం

-ఏ.పీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు

– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు

హుస్నాబాద్ ముచ్చట్లు:

బీసీల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా  బీసీల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసి 47 సంవత్సరాలుగా పోరాడుతున్న  బీసీ ల ఆశాదీపం, ఉద్యమ కెరటం, బీసీల జాతీరత్నం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య రాజ్యసభ ఏం.పీ గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రోజు హైదరాబాద్ లోని ఆర్ కృష్ణయ్య  నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. పుష్ప గుచ్చo ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ ఏం.పీ గా అవకాశం ఇచ్చిన సందర్భంగా వై.ఎస్.ఆర్.సి.పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి  హృదయపూర్వక కృతజ్ఞతలు , ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో బీసీ ల ఆత్మీయుడు ఆర్.కృష్ణయ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని రాజు ఆకాంక్షించారు.ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బిసిల హక్కులకోసం రానున్న రోజుల్లో మరింత పోరాటం చేస్తామని రాజు తెలిపారు. బిసి ఉద్యమం ఇంకా దేశవ్యాప్తంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. మన బీసీ హక్కులకోసం పార్లమెంట్ స్థాయిలో పోరాటం చేసే పటిమ ఉన్న నాయకుడు   ఆర్ కృష్ణన్న అని ఆయన అభివర్ణించారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు మోతే మాధవి ,బాలల హక్కుల సంఘం ప్రతినిధులు పిడిశెట్టి వెంకట సాయి అక్షర దేవి,అద్విత, ఆదిత్య,స్వాతీ, సోనియా, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: R. Krishnaiah sworn in as Rajya Sabha MP

Leave A Reply

Your email address will not be published.