ఆర్ ఆర్ ఆర్  90 పర్సెంట్ పూర్తి

హైదరాబాద్  ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ . దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి. పైగా ఈ మూవీతో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తెర పంచుకోనుండటం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఎప్పటికప్పుడు అనుకోని కారణాలతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ డేట్ మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు జక్కన్న. ఆర్ ఆర్ ఆర్  సినిమాకు సంబంధించి రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం ఫినిష్ అయిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని తెలిపారు. ఈ మేరకు బుల్లెట్‌పై జెట్ స్పీడుతో వెళ్ళుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టిల్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ న్యూస్ తెలియడంతో ఆర్ ఆర్ ఆర్  ఈ ఏడాది అక్టోబర్ లోనే రిలీజ్ చేసే అవకాశం ఉందనే మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది.డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఆడిపాడుతోంది. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకొని మూవీ రిలీజ్‌కి ముందే రికార్డుల సునామీ సృష్టించాయి.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:R R R 90 percent complete

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *