Natyam ad

రబీకి సాగు నీటి కష్టమే

రాజమండ్రి ముచ్చట్లు:


ఉభయ గోదావరి జిల్లాల్లో రబీకి సాగునీటి లభ్యతపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు ఖరీఫ్‌లో ఎదురైన తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు నదిలో నీటిమట్టం గణనీ యంగా తగ్గిపోవడం వంటి పరిణామాలు వారికి కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఏటా డిసెంబరు 15 నుంచి రబీ పంటల సాగు ప్రారంభం అవుతుంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ కింద 8.96 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఆయకట్టు 4.30 లక్షల ఎకరాలు. డిసెంబరు నుంచి మార్చి వరకు 92 టిఎంసిల నీరు అవసరం. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీలో 2.7 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గోదావరి ఎగువన రెండు ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చే అవకాశం ఉన్నందున 82 టిఎంసిలు రబీకి అందుబాటులో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 

 

అయినా, ఇంకా పది టిఎంసిల కొరత ఏర్పడనుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.వంతుల వారీ విధానం అమలు, నీటి వృథాను అరికట్టడం వంట చర్యలు చేపట్టే అవకాశాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. రబీ పంట గట్టెక్కాలంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటి లభ్యతకు రూ.10 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ నిధులతో పంట, మురుగు కాల్వలకు అడ్డుకట్టలు వేయడం, యంత్రాలతో నీటిని తోడిపోయడం వంటివి చేపట్టాల్సి ఉంటుంది. గతేడాది సాగునీటి సలహా మండలి (ఐఎబి) సమావేశాలు నిర్వహించి కాలువల ఆధునీకరణ, స్లూయిజ్‌లు ఏర్పాటు, డ్రెయిన్ల పూడికతీత పనులకు సుమారు రూ.60 కోట్లతో అంచనాలను అధికారులు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులు గుర్రపు డెక్క తొలగింపు, అక్కడక్కడక్కడా కాలువల మరమ్మతులకు వినియోగించి మమ అనిపించారు. కొన్నేళ్లుగా నిధుల కొరత వేధిస్తుండడంతో ఇరిగేషన్‌ శాఖ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

 

 

 

Post Midle

ఖరీఫ్‌లో కరువు తరుముకొచ్చి మెట్ట రైతులు నష్టాల పాలయ్యారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడదంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో, చివరి తడితో పంటను కాపాడుకునేందుకు జగ్గంపేట, గోకవరం తదితర మండలాల్లో రైతులు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. రైతులను ఆదుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో రైతులు సాగుకు వెనకడుగు వేస్తున్నారు.జిల్లాల వారీగా ఐఎబి సమావేశాలు నిర్వహించనున్నాం. మంగళవారం కాకినాడ జిల్లా, బుధవారం తూర్పుగోదావరి జిల్లా, గురువారం కోనసీమ జిల్లా సమావేశం నిర్వహిస్తాం. గోదావరిలో ప్రస్తుతం 2.7 టిఎంసిల నీటి నిల్వ ఉంది. చర్చల అనంతరం తాగునీటి కేటాయింపులు, రబీ సాగుకు నీరు విడుదల తేదీ ఖరారు, ప్రత్యామ్నాయాలపై నిర్ణయాలు వెల్లడించనున్నాం.

 

Tags: Rabi cultivation is difficult to water

Post Midle