భరతమాత ముద్దు బిడ్డ రవీంద్రనాథ్‌రెడ్డి

Rabindranath Reddy, the baby of Bharatmata

Rabindranath Reddy, the baby of Bharatmata

– ఇంటి నిండా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు
– మూడు సింహాల స్తంభం ఏర్పాటు

Date:10/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఏదేశమేగినా…ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అన్నాడో మహాకవి. దానిని గుర్తుంచుకున్న ఈయన ఏదేశమేగినా …ఏపని చేసినా…భరతమాతను మరచిపోలేదు. జాతీయజెండాలు , జాతీయ గీతాలు, జాతీయ నాయకుల విగ్రహాలతో తన ఇంటినే మ్యూజియంగా మార్చేశారు. ఇంటి ఆవరణలో పచ్చని పండ్లు, పూల వెహోక్కలు పెంచుతూ ఆకొమ్మల్లో పక్షుల కోసం గూళ్లను ఏర్పాటు చేస్తూ..విశ్రాంత జీవితాన్ని వైవిధ్యంగా ఉల్లాసంగా …ఆనందగా గడుపుతున్న ఎన్‌ఆర్‌ఐ రవీంద్రనాథ్‌రెడ్డి భరతమాత ముద్దుబిడ్డగా పలువురు అభివర్ణిస్తుంటారు.

బి.కొత్తకోట మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన లక్ష్మినారాయణరెడ్డి, పద్మావత మ్మ దంపతుల కుమారుడు రవీంధ్రనాథ్‌రెడ్డి ఆయన లెక్షరర్‌గా వృత్తి ప్రారంభించి, మదనపల్లె , తిరుపతి , బాపట్ల, తదితర ప్రాంతాలలో వ్యవసాయ కళాశాలల్లో పని చేశారు. 1980లో న్యూయార్క్కు ఉద్యోగరీత్యా వెళ్లారు. 1985 నుంచి అక్కడే సెయింట్‌ రీసెర్చ్ సెంటర్‌లో శాస్త్రవేత్తగా పని చేశారు. 2002లో ఉద్యోగ విరమణ పొందారు. 2006లో పుంగనూరు మండలం పూజగానిపల్లెకు వచ్చేశారు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడినా ఆయన పల్లెను వదిలి వెళ్లడం ఇష్టంలేక ఇక్కడే స్థిరపడ్డారు.

దేశభక్తి అనిర్వచనీయం…

ఇంట్లో మువ్వన్నెల జాతీయపతాకం ఆవరణలో అద్దాల గదిని ఏర్పాటు చేశారు. అందులో తెలుగుతల్లి విగ్రహం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మహత్మగ్యాధీ, గౌతమబుద్దుడు , వివేకానందుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇంటి ఆవరణంలో అశోకుని మూడు సింహాల స్తంభాన్ని ఇంటి వద్ద ప్రతిష్టించారు. ఇంటిముందుభాగంలో ఓవైపు మాతెలుగుతల్లి గీతాన్ని మరోవైపు ఏదేశమేగినా..ఎందుకాలిడినా గీతాన్ని రాయించారు. ప్రతి రోజు దేశనాయకులకు నివాళులర్పిస్తారు.

నిలువెత్తు మానవత్వం …

నిత్యం పత్రికలు చదువుతూ సమాజంలో కష్టాలు పడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడం కూడ ఆయన దినచర్యలో భాగమే. విరాళాలను ఎవరికి తెలియకుండ అందజేయడం ఆయనలోని మరో విశిష్టత. ప్రజల సౌకర్యార్థం ఇంటిముందు నీటి కొళాయిలను ఏర్పాటు చేసి, ఆగ్రామంలో నీటి సమస్య లేకుండా చేశారు. ఇంటికి కరెంటు వినియోగించకుండా సూర్యరశ్మితో సోలార్‌లైట్లు వెలిగించుకుంటున్నారు. రవీంద్రనాథరెడ్డి వినియోగించే వాహనాలపై దేశభక్తి గీతాలు, దేశనాయకుల ఫొటోలు దర్శనమిస్తాయి. రవీంద్రనాథ్‌రెడ్డికి ప్రతినెలా క్రమం తప్పకుండా అమెరికా నుంచి పెన్షన్‌ అందుతోంది. డబ్బు రాగానే పేదలకు తన చేతనైన సహాయం చేయడం అలవర్చుకున్నారు. అలాగే పేద విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలకు డబ్బులు అందజేస్తారు . ఈ విషయమై రవీంద్రనాథ్‌రెడ్డి ఏమంటున్నారంటే అమెరికాలో మనభారతదేశ ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటి, మన గొప్పతనాన్ని అమెరికా గుర్తించి నాకు అమెరికా గౌరవ పురస్కారం అందించింది. అందుకే అమెరికా జాతీయపతకాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నా. మాతృదేశంపై ఉన్న మమకారంతో ఇక్కడే ఉండిపోతా.

రోటరీ మదుకు ఇన్ఫిరెషన్‌ అవార్డు

Tags: Rabindranath Reddy, the baby of Bharatmata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *