Natyam ad

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్      

-నేడు ఆయన వర్ధంతి

 

అమరావతి ముచ్చట్లు:

Post Midle

వంగదేశంలో 1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి ఈయనే.      రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. 1919 లొ కళా భవన్ ను ఆయన స్తాపించారు. ఇక్కడ విద్యార్ఢులు విభిన్న కళాలను నెర్చుకునెవారు.స్వాతంత్ర్య సాధన,జనగణమణరవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు.

 

 

 

బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ 1896 లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన ‘ జనగణమణ ‘ ను జాతీయ గీతంగా ప్రకటించేముందు “వందేమాతరం”, “జనగణమన” లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుధీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ‘జనగణమన’ దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమన ను జాతీయ గీతంగా వందేమాతరం ను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు.  రెండవ ప్రపంచ యుద్ధం  ప్రారంభమైనపుడు రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యాడు. తీవ్రంగా వ్యాధితో బాధపడుతూ, చికిత్సకై కలకత్తా నగరానికి వెళ్లాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా టాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. గీతాంజలి‘, గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడేలా సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా వాడుక భాషలో, సరళమైన శబ్దాలతో ఉండేలా, దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతత్వం చాటేలా రెండు గీతాలను భారతదేశం(జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయ గీతాలను రచించారు.

 

 

 

ఈయన కేవలం గీత రచయిత మాత్రమే కాదు.. నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యతగా బహుముఖ ప్రజ్ణాశాలిగా ప్రసిద్ధి చెందాడు. వీటితో పాటు ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి మాతృభూమి, మానవ సంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ 1941వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు.   రవీంద్రుని రచనలలో గీతాంజలి చాలా గొప్పది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన.   మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. రవీంద్రుని గీతాంజలిలో విస్తృతంగా జనప్రియమైన రచన, “ఎక్కడ మనస్సు నిర్భయంగావుంటుందో,ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో,తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు. ఇది యిప్పటికి ఎప్పటికి ఓ మహా అద్భుత కావ్యం చరిత్రలో నిలిచిపోతుంది.

 

Tags: Rabindranath Tagore was the poet who gave the national anthem of India

Post Midle

Leave A Reply

Your email address will not be published.