మనస్థాపానికి గురైన రాధా బందరు పార్లమెంట్ పై గురి పెట్టాలని సూచన

Radha Bindu, who is the leader of our country,

Radha Bindu, who is the leader of our country,

Date:17/06/2018
విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ నేత వంగవీటి రంగా గత కొంత కాలంగా, వైసీపీ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగుతున్నారు. ఒకానొక సందర్భంలో తాను పార్టీ మారుతునట్టు వార్తలు కూడా వచ్చాయి. మరో పక్క గౌతం రెడ్డితో, జగన్ ఆడించిన గేమ్, ఇప్పటికీ రాధాను, తన వర్గాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. గౌతం రెడ్డి అన్ని మాటలు అన్నా, సస్పెన్షన్ ఎత్తిసి మరీ, జగన్ మళ్ళీ తన పక్కన చేర్చుకోవటంతో, రాధా అవమానం అయినా, భరిస్తూ వచ్చారు. మొన్న విజయవాడలో జగన్ పాదయాత్ర సందర్భంగా, భారీ జనసమీకరణ కూడా చేసారు రాధా.
ఈ సందర్భంలో, విజయవాడ సెంట్రల్ సీట్ పై జగన్ భరోసా ఇచ్చినట్టు రాధా వర్గీయులు చెప్పారు.కాని జగన్ మాత్రం, వెంటనే గౌతం రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తేయటం, అలాగే మల్లాది విష్ణుని కూడా విజయవాడ సెంట్రల్ పైనే ఫోకస్ పెట్టమని చెప్పటంతో, రాధా వర్గం ఒకింత షాక్ అయ్యింది. ఈ గేమ్ అంతా తెలియని రాధా, జగన్ చెప్పాడు కదా అని తన పని తాను చేసుకో పోతుంటే,  మరో షాక్ ఇచ్చింది వైసీపీ పార్టీ.. దీంతో పార్టీ కీలక నేత వంగవీటి రాధా అలకబూనారు.
వివరాల్లోకి వెళ్తే, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్ ను రాధా ఆశిస్తున్నారు. అయితే, రాధాను బందరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నట్టు, రాధాకు సమాచారం ఇచ్చారు.విజయవాడలో వైసీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాను విజయవాడ సెంట్రల్ స్థానం నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేసి, సమావేశం మధ్యలోనే ఆయన వెళ్లిపోయారు. రేపటి నుంచి నిర్వహింప తలపెట్టిన ‘గడప గడపకూ వైసీపీ’ కార్యక్రమాన్ని… విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించాలంటూ మల్లాది విష్ణుకు జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.
దీనిపై రాధా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. జగన తనకు మాట ఇచ్చి, ఇప్పుడు అవమాన పరిచారు అంటూ, రాధా అలిగి వెళ్ళిపోయారు. దీంతో అలిగిన రాధా సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. అయితే రాధా తీరు పై జగన్, విజయసాయి రెడ్డి కూడా గుర్రుగా ఉన్నట్టు చెప్తున్నారు. ఉంటే ఉండమను, లేకపోతే పొమ్మను, నెక్స్ట్ అధికారం మనదే అంటూ, జగన్ చెప్పినట్టు తెలుస్తుంది.. ప్రతి సమన్వయ కర్త ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని సూచించారు.
వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను జనంలోకి తీసుకెళ్తూ వాటి ద్వారా చేకూరే లబ్ధిని తెలియజేయాలన్నారు. మరో వైపు అధికారం పోతుందని తెలిసే టీడీపీ నేతలు అవినీతి, దోపీడీలకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు విమర్శించారు. చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని పాలించడం వదిలేసి దోచుకోవడమే పరమావధిగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. బాబు దోపిడీలను ప్రజలకు వివరిస్తూనే అధికారంలోకి వస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏం చేస్తుందో వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
Tags:Radha Bindu, who is the leader of our country,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *