సోషల్ మీడియాలో రాధిక ఆప్టే 

Radia Apte in Social Media

Radia Apte in Social Media

Date:17/11/2018
ముంబై ముచ్చట్లు:
తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఎంతో మంది హీరోయిన్లు మీటూ ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ రాధికా ఆప్టే మాత్రం ఇలాంటి విషయాలను అంతకుముందే వెల్లడించింది. పలువురు దక్షిణాది, ఉత్తరాది ప్రముఖులపై రాధిక ఆరోపణలు కూడా చేసింది. హాట్ హాట్‌గా ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సంచలనం సృష్టించే రాధిక తన చర్యలను సమర్థించుకుంటోంది.నా శరీరం నా ఇష్టం అని సమాధానం చెప్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మీటూ గురించి ప్రస్తావిస్తే దానికి తాను వందశాతం మద్దతునిస్తానంటోంది. ‘‘అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైన వారు ఇప్పుడు బహిరంగంగా తమ బాధలను చెప్పుకోగలుగుతున్నారు. అలాంటి వారికి సమాజం అండగా నిలవడం ఆరోగ్యకరమైన అంశం. అయితే మీటూ వ్యవహారంలో ఫిర్యాదు చేసే మహిళలను అందుకు ఆధారాలు అడగడం కరెక్ట్ కాదు.ఇలాంటి విషయాల్లో ఆధారాలు సేకరించి ఆరోపణలు చేయడం కుదరదు. ఇకపోతే మహిళలు మగవారి అత్యాచార వేధింపు చర్యలకు వ్యతిరేకించకపోతే వారు తప్పులు చేసుకుంటూనే పోతారు. ఒకసారి తన వెంట పడిన వ్యక్తిని అడ్డగించి బుద్ధి చెప్పాను. అయితే ఆ విషయాన్ని అంతటితోనే మరచిపోయాను. కానీ, చుట్టూ ఉన్న వారు ఆ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నారు’’ అంటోంది రాధికా ఆప్టే.
Tags:Radia Apte in Social Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *