రఫేల్‌ డీల్‌ఫై వ్యూహాత్మక మౌనం వహిస్తున్న ప్రధాని మోదీ

Rafael Dealif is a strategic silent PM who is Modi

Rafael Dealif is a strategic silent PM who is Modi

Date:22/11/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
రఫేల్‌ డీల్‌ఫై ప్రధాని మోదీ వ్యూహాత్మక మౌనం వహిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఏళ్ల అనుభవం ఉన్న హెచ్‌ఏఎల్‌కు కాకుండా ఊరూ పేరూలేని అనిల్‌ అంబానీ కంపెనీకి రఫేల్‌ డీల్‌ను కట్టబెట్టారని ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ అవాస్తవిక వాగ్ధనాలు చేశారని మండిపడ్డారు. ఇతర దేశాల్లో దాచుకున్న రూ.80లక్షల కోట్ల నల్లధనం తీసుకొస్తానని, ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని మోదీ చెప్పారని గుర్తుచేశారు. కనీసం రూ.15 కూడా వేయలేదని ఎద్దేవాచేశారు. స్వతంత్ర సంస్థల స్వేచ్ఛను దెబ్బతీశారని ఆరోపించారు. మోదీ హయాంలో నోట్ల రద్దు అతిపెద్ద తప్పిందని విమర్శించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా నష్టపోయిందన్నారు. 2015 ఏప్రిల్‌ 14న రఫేల్‌ ఒప్పందం జరిగిందని, ఒప్పందంలో హెచ్‌ఏఎల్‌ భాగస్వామిగా ఉంటుందన్నారు.. గానీ అలా జరగలేదని చెప్పారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి జయశంకర్‌ చెప్పిన దానికి భిన్నంగా ఒప్పందం జరిగిందన్నారు. మాట వినని వారిపై సీబీఐ, ఈడీలతో మోదీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
Tags:Rafael Dealif is a strategic silent PM who is Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *