Natyam ad

పుట్టిన రోజున శ్రీనివాసుడి సన్నిధిలో రాఘవ లారెన్స్

తిరుమల ముచ్చట్లు:


తిరుమల శ్రీవారిని సినీనటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు.. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రాఘవ లారెన్స్ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన రాఘవ లారెన్స్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీనివాసుడి ఆశీర్వాదం కోసం తిరుమలకు రావడం జరిగిందని, నాకు దేవుడు అన్ని ఇచ్చాడని, తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు.. అదే విధంగా భక్తులు కోరిన కోర్కెలు అన్ని నేరవేర్చాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.. ఏప్రిల్ 14వ తారీఖున రుద్రన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రాఘవ లారెన్స్ తెలియజేశారు.

 

Tags: Raghava Lawrence in the presence of Srinivasa on his birthday

Post Midle
Post Midle