కాపుల ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించిన రఘువీరా

Raghuvira who visited the Kapu Pravin family
Date:11/08/2018
భద్రాద్రి ముచ్చట్లు:
ఒక మాజీ విలేకరి కారణంగా ఇటీవలఆత్మహత్య చేసుకున్న కాపుల ప్రవీణ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ లు అన్నారు.శనివారం భద్రాచలం వచ్చిన కాంగ్రెస్ నేతలు రు కాపుల ప్రవీణ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కాపుల ప్రవీణ్ మృతికి కారణమైన ఒక మాజీ విలేఖరికి కొంతమంది మద్దతు పలుకుతూ , సత్యాన్ని సమాధి చెయ్యాలని చూస్తున్నట్లు విమర్శలు ఉన్నాయని వారు అన్నారు. అటువంటి వారు పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. అన్యాయం ఒకరికి జరిగితే, ఇంకొకరికి మద్దతు పలకడం తప్పుడు విధానం అన్నారు.కాంగ్రెస్ పార్టీ కాపుల ప్రకాష్ కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటుంది అన్నారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని.ఈ విషయం పై తెలంగాణ డీజీపీ తో మాట్లాడతామని అయన అన్నారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పంతం నానాజీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గౌతమ్ భద్రాచలం,ఇతర నేతలు పాల్గొన్నారు .
Tags:Raghuvira who visited the Kapu Pravin family