Natyam ad

ర్యాగింగ్ కలకలం… 33 మంది విద్యార్దులు సస్పెండ్

రాజేంద్రనగర్ ముచ్చట్లు:

వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ర్యాగింగుకు పాల్పడుతున్న 33 మంది విద్యార్థుల సస్పెండ్ కు గురయ్యారు. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న 33 మంది విద్యార్థులను సస్పెండ్ చేసామని కాలేజీ ప్రొఫెసర్ హాస్టల్ ఇంచార్జ్ వెంకటరమణ తెలిపారు.  జూనియర్ విద్యార్థుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి 24 గంటల్లోగా ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. 32 మంది విద్యార్థులకు గాను 28 మంది జూనియర్ విద్యార్థులు తమను రాగింగ్ చేస్తున్నారంటూ కంప్లైంట్ బాక్సులో తమ ఫిర్యాదును వేశారు. కంప్లైంట్ బాక్స్ లో విద్యార్థుల ఫిర్యాదును చూసిన వెంటనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని 24 గంటల్లో కమిటీ నివేదికను అందజేయడంతో చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అయితే ఎలాంటి ర్యాగింగ్ చేశారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనల జరగలేదు, ఇకముందు ఎలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అయన వివరణ ఇచ్చారు.

 

Tags: Raging disturbance… 33 students suspended

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.