ఏపీలో ర్యాగింగ్..విద్యార్థిని ఆత్మహత్య

Raging in AP .. The student committed suicide

Raging in AP .. The student committed suicide

Date:14/08/2018
తిరుపతి ముచ్చట్లు:
ఏపీలో రెండు రోజుల్లో ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రెగుతోంది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో ఎస్వీ మెడికల్ కాలేజ్ విద్యార్థిని గీతిక ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింది. ఇంతలోనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ప్రియాంక తన నివాసంలో మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది.
మృతురాలు ప్రియాంక ప్రస్తుతం మదనపల్లి గోల్డెన్ వ్యాలీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకెండియర్ చదువుతోంది. అయితే ప్రియాంక ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రియాంకను ఆత్మహత్యకు పురికొల్పడానికి సీనియర్ విద్యార్థుల ర్యాగింగా ఇంకా ఏదైనా వ్యక్తిగత కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బంధువుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. గత ఫిబ్రవరిలో కర్నూలుకు చెందిన ప్రశాంతి అనే బీటెక్ విద్యార్థిని సైతం ఆత్మహత్య చేసుకుంది. ఫీజు విషయంలో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే ప్రశాంతి ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ప్రియాంక కేసులో కూడా ఆ కోణం ఉందా? అని అనుమానిస్తున్నారు.
Tags:Raging in AP .. The student committed suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *