విద్యార్థుల వికృత రూపాలే ర్యాగింగ్‌

Raging students' unruly forms

Raging students' unruly forms

– ప్రిన్సిపాల్‌ కృష్ణమూర్తి

Date:22/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులు ఒకొక్కసారి వికృతంగా ప్రవర్తించి, సహాచర విద్యార్థులను వేదించడమే ర్యాంగింగ్‌ అని , ఈ ర్యాంగింగ్‌ను ప్రతి ఒక్కరు అరికట్టేందుకు కృషి చేయాలని శుభారాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం కళాశాలలో ఆయనతో పాటు పోలీసులు కలసి ర్యాంగింగ్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ హెడ్‌కానిస్టేబుల్‌ శంకర్‌ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థులందరు కళాశాలలో చేరే ముందు సత్పవర్తన కలిగి ఉంటారన్నారు. కానీ కొన్ని పరిస్థితులలో కొంత మంది విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులను, సహాచర విద్యార్థులను తమ వికృత చేష్టలతో బేదిరించడం, వేదించడం చేస్తుంటారని , ఇలాంటి ప్రవర్తనను విద్యార్థులు మార్చుకోవాలని సూచించారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ర్యాగింగ్‌ భారీన పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో ప్రవేశించే సమయంలో ఎంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలకుని విద్యార్థులు అదే లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా అనుకున్న ఆశయాన్ని మార్చుకోవద్దని సూచించారు. హెడ్‌కానిస్టేబుల్‌ శ ంకర్‌ మాట్లాడుతూ ర్యాగింగ్‌లకు పాల్పడినా , విద్యార్థినీలను వేధించిన నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కలసి మెలసి విద్యార్థి జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి అపూర్వ స్పందన

Tags: Raging students’ unruly forms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *