Natyam ad

పుంగనూరులో ఎన్‌జీవోల సంఘ అధ్యక్షుడుగా రహమత్‌అలీ

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ ఎన్‌జీవోల సంఘ అధ్యక్షుడుగా డాక్టర్‌ రహమత్‌అలీ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. శనివారం స్థానిక బసవరాజ ప్రభుత్వ కళాశాలలో ఎన్‌జీవోల సంఘ ఎన్నికలను సంఘ నాయకులు ఆనందబాబు, లక్ష్మీపతియాదవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ప్రకటించారు. సంఘ కార్యదర్శిగా సురేష్‌రాజు, అసోసియేష్‌ ప్రెసిడెంట్‌గా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా మురళిబాబు, బాలసుబ్రమణ్యం, మహేశ్వర్‌లు , కార్యదర్శులుగా వెంకటముని, దాము, మహిళా కార్యదర్శిగా పుణ్యవతి, కోశాధికారిగా రఘురామయ్య ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు రహమత్‌అలీఖాన్‌ మాట్లాడుతూ ఎన్‌జీవోల సమస్యలు పరిష్కరించి, అన్ని విధాల వారికి అండగా ఉంటామని తెలిపారు.ఈ సందర్భంగా నూతన కమిటిని పలువురు సన్మానించారు.

 

Post Midle

Tags: Rahmat Ali is the president of NGO association in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.