ప్రధాని హోదాలో రాహుల్  వస్తారు : కేవీపీ

Rahul arrives in Prime Minister's rank: CVP

Rahul arrives in Prime Minister's rank: CVP

Date:15/09/2018
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
సాధారణ ఎన్నికల తర్వాత, 2019 లో సంపూర్ణంగా పూర్తి కాబోయే పోలవరం ప్రాజెక్ట్ ను ప్రధానమంత్రి హోదాలో రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు.  ఇందిర సాగర్ పోలవరం ప్రాజెక్టు గా నామకరణం చేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కల సాకారం అవుతుందని కాంగ్రెస్ సినీయర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు.
ముఖ్యమంత్రి గా బాధ్యతలు నిర్వహించకుండా చంద్రబాబు తాపీ పని చేయటానికి కూడా సిద్దం అంటున్నారు.  ప్రజాస్వామ్యంలో ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించే విధంగా ముఖ్యమంత్రి నిర్దేశించాలని అన్నారు.
అనవసరంగా చంద్రబాబు అన్ని పనులకు అడ్డుపడకుండా ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలి.   చంద్రబాబు తాపీ పట్టుకుని బయల్దేరతారు. మోడీ చీపురు పట్టుకు బయల్దేరుతారని ఎద్దేవా చేసారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వరప్రదాయుని పోలవరంకు అన్ని రకాల అనుమతులు సాధించింది కాంగ్రెస్.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంతా తన వల్లనే అనే గొప్పలు   చంద్రబాబు చెప్పుకొంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ చేసిన కృషిని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చంద్రబాబు మానుకోవాలని సూచించారు.  ఏమీ కాకుండానే ప్రజల డబ్బుతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి గ్యాలరీ వాక్, క్యాట్ వాక్ లు చేయడం ఏమిటని అయన తప్పు పట్టారు.
Tags:Rahul arrives in Prime Minister’s rank: CVP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *