ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ!

Rahul denies permission for House

Rahul denies permission for House

Date:10/08/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో ఈ నెల 13,14 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ)లో పర్యటిస్తారని, ఓ సదస్సు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టీ-కాంగ్రెస్ నేతలు పేర్కొన్న నేపద్యం లో ఓయూలో రాహుల్ సదస్సుకు అనుమతి లభించలేదు. ఇందుకు వర్శిటీ వీసీ నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా ఈ సదస్సు నిర్వహణకు అనుమతి నిరాకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు హైకోర్టును ఆశ్రయించనున్నాయని తెలుస్తోంది. కాగా, రాహుల్ ని యూనివర్శిటీలోకి అడుగుపెట్టనివ్వమని కొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. రాహుల్ ని యూనివర్శిటీలో అడుగుపెట్టనివ్వకుండా చూడాలని కోరుతూ ఇప్పటికే తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రాలు కూడా సమర్పించారు.
Tags; Rahul denies permission for House

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *