సౌత్ పై రాహుల్ ఫోకస్

Date:26/01/2021

చెన్నై ముచ్చట్లు:

పొలిటిక‌ల్ పార్టీస్ అంటే అంతే. రాజ‌కీయాలు అవే కాదు. పొలిటీషియ‌న్ అన్నాక‌.. కూసింత క‌ళాపోష‌ణ కూడా ఉండాలి. లేదంటే ఎట్టా చెప్పండి. లీడ‌ర్ల‌ని అడ్డుకోవాలంటే రాజ‌కీయాలు తెలియాలి.. జనాన్ని ఆక‌ట్టుకోవాలి అంటే.. క‌ళాపోష‌న ఉండాలి. లేదంటే.. రాహుల్ గాంధీలా ఉండాల్సి వ‌స్తుంది. వాళ్ల పార్టీలా వెన‌క‌బ‌డాల్సి వ‌స్తుంది అంటుంటారు క‌దా. ఇప్పుడు ఆ విష‌యంలో లోటు లేకుండా చూసుకుంటున్నారు కాంగ్రెస్ లీడ‌ర్ రాహుల్ గాంధీ.ఏంటో కానీ.. స‌డ‌న్ గా రాహుల్ గాంధీ ఫోక‌స్ సౌత్ పై ప‌డింది. సౌత్ పై ప‌డ‌క ఏముంది చెప్పండి. నార్త్ లో బీజేపీ బొమ్మాట ఆడిస్తుంటుంది క‌దా. కాంగ్రెస్ వాళ్లేమో.. మేము సెక్యూల‌ర్ అంటారు. బీజేపీ వాళ్లేమో.. మాది బ‌రాబర్ హిందూ పార్టీ అంటారు. అలాగే మూవ్ అవుతారు కూడా. మ‌రి నార్త్ లో హిందూ వాదం ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఆ పార్టీకి వ‌ర్క‌వుట్ అవుతుంది కానీ.. వేరే పార్టీకి క‌ష్టం క‌దా. అందుకే.. నార్త్ లో కాంగ్రెస్ కి కాస్త క‌ష్టంగానే ఉంది. ఇంత‌కు ముందు సౌత్ లో బ‌లంగా ఉండేది కాంగ్రెస్. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డిగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ దే హ‌వా. క‌ర్ణాట‌య‌, కేర‌ళ‌లో కూడా అంతే. త‌మిళ నాడులో కూడా బానే న‌డిచేది ఇప్పుడు తెలంగాణ‌లో న‌డిపించే నాయ‌కుడే క‌రువ‌య్యాడు.. న‌డిచే లీడ‌ర్లు క‌రువ‌య్యారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అయితే.. కాంగ్రెస్ ఉందో లేదో కూడా ఎవ‌రికీ తెలీదు.

 

అందుకే.. ఎలాగూ.. నార్త్ లో కాంగ్రెస్ పుంజుకునే ఛాన్సులు లేవు కాబ‌ట్టి.. సౌత్ పై ఫోక‌స్ చేశార‌ట రాహుల్ గాంధీ. ఎలాగూ త‌మిళ నాడులో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్నాయి క‌దా.. అందుకే అక్క‌డ మార్క్ చేశారు. మొన్న జ‌ల్లిక‌ట్టుకి కూడా వెళ్లొచ్చారు క‌దా. అంతే కాదు. త‌మిళ సంస్కృతిపై క‌ళ మొత్తం చూపిస్తున్నారు. అక్క‌డి క‌ల్చ‌ర్ గురించి పొగుడుతూ.. ఆ రాష్ట్రం గురించి గొప్ప‌గా చెబుతూ.. వీలైనంత‌లో త‌మిళుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఎన్నిక‌ల టైం కావడంతో.. అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై కాస్త ఫోక‌స్ చేస్తే.. పాత ఓటు బ్యాంకు మొత్తం వెన‌క్కి వ‌స్తుంది అని లెక్క‌లేస్తున్నార‌ట‌. క‌ర్ణాట‌క‌లో కూడా ఇదే మంత్రం ఫాలో కావాలి అని.. సౌత్ మొత్తం కాంగ్రెస్ కంచుకోట అనే స్థాయికి తీసుకురావాలి అనేది.. రాహుల్ ప్లాన్ అట‌. అందుకే.. బ‌ల‌మైన లీడ‌ర్లు అంద‌రినీ బుట్ట‌లో వేసుకునేందుకు త‌న ప్ర‌య‌త్నాలు గట్టిగానే చేస్తున్నార‌ట రాహుల్ గాంధీ.

దేశాభివృద్ధికి యువత పునరంకితం కావాలి

Tags: Rahul Focus on the South

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *