దక్షిణాదిలోనూ రాహుల్‌ గాంధీ పోటీ?

Rahul's nomination is correct

Rahul's nomination is correct

Date:15/03/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ సారి లోక్‌ సభ ఎన్నికల్లో దక్షిణాదిలోనూ పోటీ చేయనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడూ పోటీ చేసే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేథీతో పాటు ఈ సారి ఆయన కర్ణాటక నుంచి కూడా బరిలోకి దిగనున్నారని సమాచారం. తన ఎన్నికల ప్రచారాన్ని కూడా దక్షిణాది నుంచే ప్రారంభించడం ఈ వార్తలకు మరింత తావిస్తోంది.దక్షిణాది నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు, కొందరు సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీని కోరారట. వీరి డిమాండ్లకు తలొగ్గిన రాహుల్‌ అందుకు అంగీకరించారట. కన్నడ రాష్ట్రంలో ఓ కీలక స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారని సమాచారం. గతంలో సోనియా గాంధీ సైతం కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి సుష్మా స్వరాజ్‌పై గెలుపొందారు.  2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అయితే వీటిపై ఇటు రాహుల్‌ గానీ, అటు కాంగ్రెస్‌ వర్గాలు గానీ స్పందించలేదు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!.2019 లోక్‌ సభ ఎన్నికలు ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలోని 543 లోక్‌ సభ స్థానాలకు గానూ ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Tags:Rahul Gandhi to contest in South

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *