అవిశ్వాసంపై మాట్లాడనున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi to speak on infidelity

Rahul Gandhi to speak on infidelity

Date:19/07/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. శుక్రవారం లోక్‌సభలో జరగనున్న అవిశ్వాస తీర్మాన చర్చలో మాట్లాడనున్నారు. ఈ అంశం గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి గంట సమయం కేటాయించినట్లు తెలుస్తున్నది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి రాహుల్ నేతృత్వం వహించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు ఇతరులు కూడా మాట్లాడనున్నారు. బీజేపీపై ఎన్నికల అస్ర్తాన్ని సంధించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస అంశంపై రాహుల్‌తో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నది. చర్చ సమయంలో మోదీపై రాహుల్ ఫైర్ అయ్యే ఛాన్సుంది. అయితే చర్చకు సమాధానం ఇచ్చేందుకు కూడా మోదీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఇవాళ పార్లమెంట్‌లో ఆర్టీఐ చట్ట సవరణ కోరుతూ ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నది. ఆర్టీఐను మార్చడం వల్ల ఆ చట్టం వ్యర్థంగా మారుతుందని రాహుల్ విమర్శించారు. ప్రత్యేక హోదా కోరుతూ కూడా ప్రభుత్వంపై టీడీపీ కుస్తీ చేస్తోంది. దీనిలో భాగంగా టీడీపీ ..అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బుధవారం లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని .. అవిశ్వాస తీర్మానాన్ని చదివారు.

అవిశ్వాసంపై మాట్లాడనున్న రాహుల్ గాంధీ https://www.telugumuchatlu.com/rahul-gandhi-to-speak-on-infidelity/

Tags:Rahul Gandhi to speak on infidelity

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *