రాహుల్ చేతులెత్తేశారు

Date:09/10/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

రాహుల్ గాంధీ పార్టీ పట్ల, ఎన్నికల పట్ల అంత సీరియస్ గా లేదన్నది మరోసారి స్పష్టమయింది. మహరాష్ట్ర, హర్యానా ఎన్నికల సమయంలో ఆయన విదేశీ పర్యటన పార్టీలోనూదుమారం రేపుతోంది. హర్యానా ఎన్నికల విషయం పక్కన పెడితే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలవకపోయినా కనీసం సత్తాచాటలేకపోతే క్యాడర్ లోనూ, నేతల్లోనూ నిరుత్సాహం తప్పదు.గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ సారథ్యంలోనే ఎన్నికలకు కాంగ్రెస్ వెళ్లింది. ఆ ఎన్నికల్లో మోడీ, షాల సొంతరాష్ట్రంలోనే రాహుల్ గాంధీ వారికి చుక్కలు చూపించారు. గుజారాత్ లో కాంగ్రెస్ గెలవకపోయినా గెలిచినట్లేనని విశ్లేషకులు సయితం అంగీకరించారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేసయితం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ పరిణితి చెందిన నాయకుడిగా ఠాక్రే అభివర్ణించారు.

 

 

 

 

అయితే ఇటీవల జరిగినసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూడటంతో రాహుల్ గాంధీ డీలా పడిపోయారు. తన మీద తనకే నమ్మకం లేనట్లు ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.పార్టీని భుజానికెత్తుకోవాల్సిన సమయంలో రాహుల్ గాంధీ కాడి వదిలేయడాన్ని సీనియర్ నేతలు సయితం తప్పుపట్టారు. ఎంతమంది సర్దిచెప్పినా, పెద్దలు బుజ్జగించినా రాహుల్ గాంధీవినలేదు. చివరకు సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.ఇప్పుడు మహరాష్ట్ర, హర్యానా ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం పార్టీలోచర్చనీయాంశంగా మారింది. పార్టీ పట్ల రాహుల్ గాంధీకి సీరియస్ నెస్ లేదని సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. రాహుల్ విదేశీ పర్యటనలను బీజేపీ తనకు అనుకూలంగా
మలచుకుంటోంది. అసలే మహారాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వ్యవహారశైలితో మరింత దెబ్బతినే అవకాశముంది.

 

ఇవాళ్టి నుంచి ఏపీలో కంటి వెలుగు

 

Tags: Rahul shook hands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *