రాహుల్ సభలను విజయవంతం చేయాలి:గద్దర్

Rahul should succeed houses: Gaddar

Rahul should succeed houses: Gaddar

Date:19/10/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
కాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్న ఈ నేపథ్యంలో ప్రజా గాయకుడు గద్దర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ పర్యటనను స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో రాహుల్‌గాంధీ ఉద్యమిస్తున్నారని, తెలంగాణలో ఆయన సభలను విజయవంతం చేయాలని గద్దర్‌ పిలుపునిచ్చారు.ఇటీవల దిల్లీ వెళ్లిన గద్దర్‌.. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలోనూ చేరబోననని చెప్పారు. త్యాగాలు చేసిన వారికి తెలంగాణ ఫలాలు చేరలేదని, ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి తెలంగాణను విముక్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపైనే ఉందని గద్దర్‌ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.
కాగా ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సిద్ధమైంది. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భైంసా, కామారెడ్డిలలో జరిగే రెండు బహిరంగ సభల్లో రాహుల్‌ ప్రసగించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగే రాజీవ్‌ సద్భావనా యాత్రలోనూ పాల్గొంటారు.వచ్చే వారం నుంచి సోనియా గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.
రాహుల్‌ పర్యటన ముగిసిన వెంటనే పీసీసీ ప్రచార కమిటీ ప్రచారాన్ని కొనసాగించనుంది. భట్టి విక్రమార్క, విజయశాంతిలతో పాటు ఇతర ప్రముఖ నేతలు ఈ ప్రచారంలో పాల్గొంటారు. 27,28 తేదీల్లో మరో దఫా రాష్ట్రంలో పర్యటించేందుకు రాహుల్‌ గాంధీ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వరంగల్‌ లేదా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.
Tags:Rahul should succeed houses: Gaddar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *