రాహూల్ టార్గెట్ 2019

Rahul Target 2019

Rahul Target 2019

Date:08/10/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
తగ్గైనా… పెరగాలి అన్నట్టుగా రాహుల్ వ్యవహరిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిణితి చెందినట్లే కన్పిస్తోంది. మోదీకి ధీటైన నేత విపక్ష కూటమిలో లేడన్న విమర్శలకు ఆయన చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ కోరుకుంటే తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. నిన్న మొన్నటి వరకూ ప్రధాన మంత్రి పదవి పోటీలో తాను లేనని రాహుల్ చెప్పుకొచ్చారు. దీనిపై కొన్ని భిన్న్ మైన వాదనలు విన్పించాయి. స్వపక్షంలో మాత్రం కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీయే ప్రధాని అవుతారని కొందరు అభిప్రాయపడగా, శరద్ పవార్ లాంటి మిత్రపక్షంలోని సీనియర్ నేతలు రాహుల్ వ్యాఖ్యలను ఆహ్వానించారు.అయితే కూటమికి బలమైన నాయకత్వం లేదన్న కారణంతో తటస్థ ఓటు బ్యాంకు మోదీ వైపు మళ్లుతుందని గ్రహించిన రాహుల్ తన వ్యాఖ్యలతో కొంత సర్దుబాటు చేసినట్లే కన్పిస్తోంది.
మిత్రపక్షాలు కోరుకుంటే తాను ప్రధానిని అవుతానని చెప్పడం వెనక కూడా పార్టీ క్యాడర్ లో జోష్ నింపడానికే నంటున్నారు. రాహుల్ చెప్పిన దానిని బట్టి చూస్తే కూటమి పక్షాల్లో రెండు దశల్లో చర్చలు ఉంటాయి. మొదటి దశలో సీట్ల సర్దుబాటు అంశం మాత్రమే ఉంటుంది. రెండో దశలోనే పీఎం అభ్యర్థి ఎవరనేది చర్చిస్తారు. అయితే ఈ రెండోదశ చర్చ ఎన్నికల అనంతరం ఉంటుందా? ముందే ఉంటుందా? అన్నది మాత్రం సస్పెన్స్.మరో వైపు సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత దెబ్బతినకుండా రాహుల్ కొంత వెనక్కు తగ్గినట్లే కన్పిస్తోంది. ఇప్పటికే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో సొంత కుంపటి పెట్టుకున్నారు.
ఛత్తీస్ ఘడ్ లో అజిత్ సింగ్ పార్టీతోనూ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఒంటరిగా పోటీ చేయాలని మాయావతి నిర్ణయించారు. అయితే రాహుల్ మాత్రం మాయావతి విషయంలో కొంత తగ్గినట్లే కన్పిస్తోంది.లోక్ సభ ఎన్నికలలో మాత్రం మాయావతితో ఖచ్చితంగా కలసి నడుస్తామని చెప్పారు. రాష్ట్రాల ఎన్నికలు వేరని, సార్వత్రిక ఎన్నికలు వేరన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో మోదీని ఓడించడానికి బీజీపేయేతర శక్తులన్నీ కలుస్తాయని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ను దృష్టిలో పెట్టుకునే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీలతో మహాకూటమిగా ముందుకు వెళ్లేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. సీట్ల విషయంలో తేడా వచ్చినా సర్దుకుపోయేలా రాహుల్ ఉన్నట్లు కన్పిస్తోంది. మొత్తం మీద రాహుల్ కొంత తగ్గినట్లు కన్పించినా రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకుని పోయేందుకేనన్నది పార్టీ నేతల అభిప్రాయం.
Tags:Rahul Target 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed