Natyam ad

కొనసాగుతున్న రాహుల్ యాత్ర

కర్నూలు  ముచ్చట్లు:


హుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మూడో రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం కర్నూలు జిల్లాలోని బనవాసి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర కల్లుదేవరకుంట వరకు కొనసాగింది. బోడిబండ నుంచి ఎమ్మిగనూరు, ధర్మాపురం టోల్ గేట్ మీదుగా కలుదేవకుంట వరకు 22కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర కొనసాగానుంది. ముగటి, హలహర్వి మీదుగా చేరుకోనుంది. సాయంత్రం రాహుల్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించి.. మఠాధిపతి శ్రీసుబుదేంద్రతీర్థ స్వామిజీని కలిసి సంభాషించారు. సాయంత్రం చెట్నిహల్లిలో పాదయాత్ర నైట్ హాల్ట్  ఏర్పాటు చేశామనికాంగ్రెస్ నాయకులు తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ… ఆయన చేపట్టిన భారత్‌ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుండగా.. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉంది… అంతే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల రిమోట్‌ కంట్రోల్‌ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉందని ఆరోపించారు.. ఇక, అన్నదమ్ముల్లా కలసి ఉన్న దేశాన్ని బీజేపీ విభజిస్తోందని విమర్శించిన ఆయన..

 

 

కుల, మతాల పేరుమీద విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రధాని నరేంద్ర మోడీ రిమోట్‌తో ఆంధ్రప్రదేశ్‌ని శాసిస్తున్నారు.. అందుకు కారణం ఏమిటో అందరికీ తెలుసు అంటూ సెటైర్లు వేశారు.
మరోవైపు బీజేపీతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కమిట్‌మెంట్స్‌ ఉన్నాయని ఆరోపించారు రాహుల్‌ గాంధీ.. కానీ, కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్‌తో చాలా కమిట్‌మెంట్స్‌ ఉన్నాయని తెలిపారు.. మేం పోలవరం ప్రాజెక్ట్‌, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్ స్టేటస్ , రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. ఈ అంశాలను లెవనెత్తడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డ ఆయన.. బీజేపీ కంట్రోల్ లో ఉన్నందుకు ఈ అంశాలు లెవనెత్తడం లేదని ఆరోపించారు.. రాయలసీమకు న్యాయం చేయడం, స్పెషల్ స్టేటస్ కు యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు రాహుల్‌ గాంధీ.. కాగా, రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని.. ఆ విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలన్నారు. మూడు రాజధానుల ఆలోచన సరికాదని హితవుపలికిన ఆయన.. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని..

 

 

 

Post Midle

పోలవరం పూర్తి చేస్తామని ఉదయం రాహుల్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.హాలహర్వి, కల్లుదేవరకుంటలో రాహుల్ ప్రసంగించనున్నారు. ఈ యాత్ర కోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది.ఏపీలో శుక్రవారం వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 96 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులతోపాటు.. తెలంగాణ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఏపీ నుంచి కర్ణాటకకు, ఆ తర్వాత 23న తెలంగాణకు భారత్‌ జోడో యాత్ర చేరుకోనుంది.రాహుల్‌ భారత్‌ జోడో యాత్రలో ఉద్రిక్తత చెలరేగింది. పాదయాత్రలో స్వల్ప టెన్షన్‌ రేపింది. సిఆర్పిఎఫ్ వాహన డ్రైవర్‌, పాదయాత్ర టీమ్‌ మెంబర్స్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్‌ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ పెద్దగా మారింది. టీమ్‌ మెంబర్స్‌, సిఆర్పిఎఫ్ సిబ్బంది మధ్య మాటామాటా పెరిగింది. ఒకదశలో ఒకరినొకరు నెట్టేసుకొనే దాకా వెళ్లింది. అక్కడే ఉన్న పలువురు సర్దిచెప్పడంతో పంచాయితీ సర్దుమణిగింది.

 

Tags: Rahul’s journey continues

Post Midle

Leave A Reply

Your email address will not be published.