రాహుల్ ఆలింగనంపై స్పందించిన ప్రధాని!

Rahul's response to embarrassment

Rahul's response to embarrassment

Date:21/07/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తనను ఆలింగనం చేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు. పేరు ప్రస్తావించకుండా రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పనిలో పనిగా విపక్షాలకు కూడా చురకలు వేశారు. ‘‘ప్రధానమంత్రి కుర్చీ దగ్గరకు వాళ్లు ఎలా పరుగెత్తుకొస్తున్నారో మీరంతా చూశారు. వాళ్లకు ప్రధానమంత్రి కుర్చీ తప్ప మరేమీ కనిపించదు..’’ అని ప్రధాని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఎన్డీయే ప్రభుత్వం నెగ్గిన అనంతరం తొలిసారి ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ వేదికగా ప్రధాని మోదీ మాట్లాడారు.‘‘మాపై ఎందుకు విశ్వాసం లేదని మేము ప్రతిపక్షాన్ని అడిగాం. వాళ్ల దగ్గర సమాధానం లేకపోవడంతో… నా దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నారు..’’ అని ప్రధాని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం దేశంలోని 125 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందనీ.. తాము స్థిరమైన అభివృద్ధి వైపు పయనిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఏ కారణం లేకుండానే తమపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయన్నారు. అవినీతికి అవకాశంలేకుండా దారులన్నీ మూసేసినందుకే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టారనీ.. అయితే దేశప్రజలు దానిని ఓడించారన్నారు.‘‘సరైన మార్గంలో పయనిస్తూ, ఏ తప్పూ చేయకపోవడమే నేను చేసిన నేరమా?’’ అని ప్రధాని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా రైతుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. తాము చేపట్టిన పథకాలు చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. 2019 నాటికల్లా దేశంలోని అన్ని గృహాల్లోనూ విద్యుత్ వెలుగులు నింపుతామన్నారు.

రాహుల్ ఆలింగనంపై స్పందించిన ప్రధాని! https://www.telugumuchatlu.com/rahuls-response-to-embarrassment/

Tags:Rahul’s response to embarrassment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *