Natyam ad

రైళ్లను ఆపాలని కోరుతూ రైల్ రోకో

కడప ముచ్చట్లు:
 
కడప జిల్లాలోని కొన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపాలని వైకాపా నేతలు రైలు రోకో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి రేల్వే గేటు వరకు ర్యాలీని నిర్వహించారు. రైల్వే గేటు పట్టాలపై నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి  మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని స్టేషన్ లలో రైలు ఆపాలని కోరుతూ రైల్వే స్టేషన్ మాస్టర్ లకు రైల్వే ఉన్నతాధికారులకు ఎంత విన్నవించిన ప్రయోజనం లేదని అన్నారు.  సౌత్ ఇండియా పై బిజెపి ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోంది.  కరోనా పేరుతో రద్దు చేసిన రైళ్ల స్టాపింగ్ ను తిరిగి పునరుద్ధరించాలి. కడప జిల్లాలోని కమలాపురం,   నందలూరు, రాజంపేట రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్ళను నిలపాలి.  అధికారులకు అనేకసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు.  నష్టాల పేరుతో రైళ్లను ఆపకుండా బిజెపి నాటకం ఆడుతోందని అన్నారు.  రైల్వే ఉన్నతాధికారులు స్పందించి హామీ ఇచ్చేంతవరకు విరమింపచేయమని అన్నారు. ఈ రైల్ రోకో లో మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి. జిల్లా వ్యవసాయ శాఖ సలహమండలి చైర్మన్  సంబటూరు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Rail rocco seeking to stop trains